31, మార్చి 2008, సోమవారం

భుక్తాయాసం తగ్గాలంటే__ మంతెన సత్యనారాయణ రాజు

వెలితిగా భోజనం చేస్తే సరిపోతుంది కదా! అనిపించవచు కానీ కంచం దగ్గర కూర్చున్నాక అల మాత్రం లేవలేక పోతున్నామని చాలా మంది అంటారు. భోజనం నిండుగా తింటూ దానికి తోడు మంచి నీటిని కూడా త్రాగుతారు. దీనితో పొట్ట ఫుల్లుగా నిండి ఈ బరువంతా వెళ్లి ఊపిరితిత్తుల చివరి భాగాల ఫై పడి, వాటిని సుమారుగా 25,30 శాతం నొక్కి వేస్తుంది. భోజనాన్ని ఆరగించడానికి శరీరానికి ఎక్కువగాలి అవసరం ఉంటుంది. దానికి తోడు ఊపిరితిత్తులు మూసుకుని పోయే సరికి శరీరానికి పూర్తిగా గాలి సరిగ్గా చాలక, భోజనం ఐన దగ్గరనుండీ భుక్తాయాసం వస్తుంది.
చిట్కాలు :-
1) భోజనాన్ని తినేటప్పుడు టేబుల్ ఫై కాకుండా క్రింద కూర్చుని తింటే మంచిది. క్రింద కూర్చునే సరికి పొట్ట పావు వంతు మూసుకుంటుంది. మీరు పూర్తిగా, నిండుగా తిని లేచేసరికి, మీకు తెలియకుండా కొంత ఖాళీ వచ్చి ఆయాసం ఉండదు.
2) తినేటప్పుడు నీరు త్రాగకుండా, తినడానికి అరగంట ముందువరకు త్రాగి, తిన్న రెండు గంటల తరవాత అప్పుడప్పుడు ఒక్కొక్క గ్లాసు త్రాగుతూ ఉంటే భుక్తాయాసం రాదు.
3) పొట్టను 80 శాతం కంటే నింపే విధం గా తినకుండా జాగర్త పడటం మంచిది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి